- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గల్ఫ్ మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది : సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య
మస్కట్ లో మరణించిన బత్తుల నర్సయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మంగళవారం తెలిపారు.

దిశ, ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామానికి చెందిన బత్తుల నర్సయ్య 42 మస్కట్ లో అకస్మాత్తుగా చనిపోయాడు. వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రతుకుదెరువు కోసం మస్కట్ వెళ్లి కంపెనీలో ఈ నెల 6న పని చేస్తుండగా గుండెపోటు వచ్చి అకస్మాత్తుగా చనిపోవడం జరిగిందని... అతని స్నేహితుల ద్వారా సమాచారం రావడం జరిగిందన్నారు. ఈ మేరకు మృతిని కుమారుడు రాకేష్ కూడా అదే బల్దియా కంపెనీలో పని చేయడంతో ఆ కంపెనీ రాకేష్ ను మంగళవారం ఇంటికి పంపించిందని.. మృతి చెందిన నర్సయ్య శవాన్ని ఇంటికి పంపించడం కోసం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను సంప్రదించగా.. అక్కడి ఎంబసీ తో మాట్లాడడం జరిగిందని శవాన్ని తొందరగా తెప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ చార్జి కేకే మహేందర్ రెడ్డి మృతుని కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని పేర్కొన్నట్టు తెలిపారు ఇక్కడి నుండచి మస్కట్ ఎంబసీకి మృతునికి సంబంధించిన ఆధారాలను పంపించడం జరిగిందన్నారు. మృతుని భార్య రేణుక తో పాటు కుమారుడు రాకేష్ ను పరామర్శించి మనోధైర్యం కల్పించడం జరిగిందన్నారు.






