గంగుల.. దొంగ వీడియోలు సృష్టిస్తే చరిత్ర హీనుడివైతావ్..: Bandi Sanjay Kumar

by Aamani |
గంగుల.. దొంగ వీడియోలు సృష్టిస్తే చరిత్ర హీనుడివైతావ్..: Bandi Sanjay Kumar
X

దిశ,కరీంనగర్: ‘‘గంగుల కమలాకర్…. కరీంనగర్ కు చేసిన అభివృద్ధిపై నేరుగా నాతో చర్చించే దమ్ము లేక నాపై దొంగ వీడియోలు సృష్టించేందుకు సిద్దమైనట్లు సమాచారం వచ్చింది.. ఖబడ్దార్… నేను తలుచుకుంటే నువ్వు బయట తిరగలేవ్… దొంగ వీడియోలు సృష్టిస్తే చరిత్ర హీనుడిగా మారతావ్’’ అంటూ కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. ‘‘నాకు నా కార్యకర్తలే హీరోలు..’’అంటూ కాషాయ దళాన్ని అభివర్ణించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజైన మంగళవారం కరీంనగర్ లో మహాబైక్ ర్యాలీ నిర్వహించారు. కనివినీ ఎరగని రీతిలో ఈ ర్యాలీకి ప్రజలు తరలివచ్చారు. మహిళలు, ముస్లిం మహిళలు సైతం ఈ ర్యాలీలో పాల్గొని బండి సంజయ్ కు సంఘీభావం ప్రకటించడం గమనార్హం. ఈ మహా బైక్ ర్యాలీ సందర్భంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద క్రిష్ణ మాదిగ ప్రారంభోపన్యాసం చేయగా…. రేకుర్తి వద్ద ముగింపు సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. మీరే (కార్యకర్తలు) నా హీరోలు…మీ కష్టం, ప్రజల ఆశీర్వాదంతో కరీంనగర్ లో భారీ మెజారిటీతో బీజేపీతో విజయం సాధించబోతున్నం. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కొట్లాడినం. నిరుద్యోగుల, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు, రైతులు, విద్యార్టులు, మహిళలలుసహా అన్ని వర్గాల ప్రజల పక్షాన కొట్లాడినం. అందుకే ప్రజలంతా బీజేపీ వైపు నిలబడ్డారు.

ఇది తట్టుకోలేక గంగుల కమలాకర్ నాపై దొంగ వీడియో, ఆడియోలు స్రుష్టించి సర్క్యులేట్ చేసే పనిలో పడ్డారట… నేను చెబుతున్న కమలాకర్… బండి సంజయ్ సంగతి నీకు తెలుసు. కార్యకర్తల సత్తా నీకు తెలుసు.. ప్రతి బూత్ లో వంద..నేను తలుచుకుంటే నీ వీడియోలు, నీ ఛాటింగ్ లు ఇంటింటికీ చూపెట్టగలను. ఎల్లుండి పోలింగ్ సమయానికి కూడా అవి చూసిన కేసీఆర్, కేటీఆర్ లు నీకు ఫోన్ చేసి పోటీ నుండి తప్పుకోవాలని చెబుతారు… అంతదాకా చేసుకోవద్దు… నేను వీడియో, చాటింగ్ లు బయట పెడితే.. నీ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది.

మీరు అధికారంలో ఉండేది మరో 48 గంటలే.. క్షణాలు, నిమిషాలు లెక్కించుకో… 30న పోలింగ్ జరగబోతోంది. కరీంనగర్ లో బీజేపీకే ఓటేయాలని ప్రజలంతా నిర్ణయించుకున్నారు. బీజేపీ చరిత్ర స్రుష్టించబోతోంది. డిసెంబర్ 3న వెలువడే ఫలితాలతో మీ గుండె బద్దలు కాబోతోంది. ఇకపై మీ ఆటలు సాగబోవు…ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి దుకాణం బంద్ చేసుకున్నడు… మీకు ఓటేస్తే వేయండి.. లేదంటే మీ ఇష్టం అని అంటున్నడు.. గంగుల కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతే ఆయన పై రౌడీషీట్ ఓపెన్ చేయాలని చూస్తున్నాడు. ఎందుకంటే ఇద్దరు భూకబ్జాదారులే…ఈరోజు నుండి బీఆర్ఎస్ నేతలు విచ్చలవిడిగా డబ్బులు పంచే పనిలో పడ్డారు.. కార్యకర్తలారా…ఓట్లను పైసలతో బీఆర్ఎస్, కాంగ్రెసోళ్లు కొనాలనుకుంటున్నరు. మీ దృష్టికి రాగానే పోలీసులకు చెప్పండి. వాళ్లు స్పందించకపోతే… మీరే వాళ్ల దగ్గర ఉన్న డబ్బులన్నీ గుంజుకోండి.. పేదలకు పంచి పెట్టండి.

ప్రజలారా… ఒక్క క్షణం ఆలోచించండి… భూకబ్జాదారులు, అవినీతి పరులు కావాలా?.... మచ్చలేని వ్యక్తిత్వం తో ప్రజల కోసం పోరాడుతున్న నేను కావాలా? ఆలోచించండి. కమలం పువ్వుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా…కార్యకర్తలారా… పోలింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలి. బీఆర్ఎస్ దుష్ప్రచారాన్ని, రౌడీయిజాన్ని తిప్పికొట్టండి. డిసెంబర్ 3న విజయోత్సవ ర్యాలీకి సిద్ధమవ్వండి అని తెలియజేశారు.

Next Story