చెరుకు ఫ్యాక్టరీ పునరుద్ధీకరణకై గళమెత్తిన గద్దర్..

by Disha Web Desk 19 |
చెరుకు ఫ్యాక్టరీ పునరుద్ధీకరణకై గళమెత్తిన గద్దర్..
X

దిశ, మల్లాపూర్: ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీ ప్రారంభం కోసం, గల్ఫ్ సంక్షేమ బోర్డు కోసం ప్రజా గాయకులు గద్దర్ గళమెత్తారు. బుధవారం రాత్రి మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో చెన్నమనేని శ్రీనివాసరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు హాజరైన గద్దర్ మాట్లాడుతూ.. పంట చేనుకు నీళ్లు లేవు.. బతుకుదెరువు కోసం గల్ఫ్ బాట పట్టి జానెడు కడుపు కోసమే ఎండనక వాననక దుబాయిలో కష్టపడుతు పిట్టల్లా రాలిపోతున్న మన రైతన్న కొరకై చక్కెర ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరుతూ.. అమరవీరుల త్యాగాలను గుర్తు చేశారు.

కొన్ని వేలమంది బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లి పొట్టకూటి కోసం జీవనం కొనసాగిస్తున్నారని, అందులో సుమారుగా ఆరు ఏడు ఏళ్లలో 1600 మంది చనిపోయారని.. వీళ్ళ శవాలు రావడానికి సుమారు రెండు మూడు నెలల టైం పడుతుందన్నారు. వీళ్ళ కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్లు పెట్టి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. షుగర్ ఫ్యాక్టరీ పునరుద్దరణ కోసం రైతులందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. అందరం ఐక్యంగా పోరాటం చేసి చెరుకు ఫ్యాక్టరీ సాధించుకుందామని అన్నారు.


Next Story

Most Viewed