మాజీ మంత్రి గంగుల కమలాకర్ సన్నిహితుడు తోట శ్రీపతి అరెస్ట్

by Disha Web Desk 23 |
మాజీ మంత్రి గంగుల కమలాకర్ సన్నిహితుడు తోట శ్రీపతి అరెస్ట్
X

దిశ బ్యూరో,కరీంనగర్ : కరీంనగర్ జిల్లా లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డ వారి అరెస్టుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపగా తాజాగా మాజీ మంత్రి గంగుల కమలాకర్ సన్నిహితుడు గతంలో ఆర్టీఏ మెంబర్ కొనసాగిన తోట శ్రీపతి ని పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ శివారులోని రవీంద్ర అనే వ్యక్తి తన భూమిని బలవంతంగా కబ్జా చేసేందుకు ప్రయత్నించారని పలుమార్లు నిర్మాణం చేపడుతా ఉంటే అర్ధరాత్రుల్లో అనుచరులతో వచ్చి కూలిచివేసాడని బాధితుడి ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు తోట శ్రీపతిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇతడి పై ఏయే కేసులు నమోదు అయ్యాయి అనేది తెలియాల్సి ఉంది.

Next Story