రసమయిని ప్రశ్నిస్తూ ఫ్లెక్సీల ఏర్పాటు..

by Disha Web Desk 20 |
రసమయిని ప్రశ్నిస్తూ ఫ్లెక్సీల ఏర్పాటు..
X

దిశ, గన్నేరువరం : రాజీవ్ రహదారి గుండ్లపల్లి నుండి పొత్తూరు వరకు డబుల్ రోడ్డు నిర్మాణం ఎప్పుడు చేపడతారని, 71 కోట్ల నిధుల మంజూరు జీవో ఉట్టిదేనా అని ప్రశ్నిస్తూ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి పలుగ్రామాలలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బీజేపీ మండల శాఖ డబుల్ రోడ్డు సాధన కై పాదయాత్ర నిర్వహిస్తే ప్రభుత్వం దిగివచ్చి 71 కోట్ల నిధులు మంజూరు చేస్తూ జీవో విడుదల చేసిందని, ఆ రోడ్డు పనులు ఏ మాత్రం ప్రారంభం కాలేదని, గునుకుల కొండాపూర్, గుండ్లపల్లి గ్రామాల ప్రజలు దుమ్ముతో సతమతమవుతున్నారని, ఎమ్మెల్యే రసమయి పనితీరు ఇదేనా అని, మండల ప్రజల ప్రయాణ కష్టాలు తీరేది ఎన్నడని ప్రశ్నిస్తూ ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలను పలువురు గ్రామస్తులు పరిశీలిస్తూ జరగని అభివృద్ధి గురించి వినూతన నిరసన తెలిపిన బీజేపీ మండల శాఖను అభినందిస్తున్నారు.


Next Story

Most Viewed