- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అతి భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం..
దిశ, కోరుట్ల టౌన్ : కోరుట్లలో గత పది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం గత రాత్రి ఉగ్ర రూపం దాల్చి అతి భారీ వర్షముగా ప్రభావం చెందింది. బుధవారం రాత్రి నుండి కురుస్తున్న అతి వర్షం కారణంగా కోరుట్ల, మేడిపెల్లి, కథలాపూర్ మండలాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండి మత్తడి పోస్తున్నాయి. కోరుట్ల పట్టణంలోనీ కల్లూరు రోడ్ రైల్వే బ్రిడ్జి వద్ద వరద ప్రవహిస్తుంది. దీంతో స్థానికులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రకాశం రోడ్ లో వరద నీరు ఇండ్ల మధ్య నుండి ప్రవహిస్తుంది. దీంతో జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు ప్రకాశం రోడ్డులో వరదనీరు విషయం తెలియడంతో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్వకుంట్ల సంజయ్, అన్నం అనిల్, కౌన్సిలర్, వైస్ చైర్మన్ గడ్డమీది పవన్ వార్డులో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.
కోరుట్ల పూల్ వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది.దీంతో గంగం పేట కాలనీలో వాగు పక్కనే ఉన్నా ఇండ్లలోకి నీళ్లు చేరాయి. మండలంలోని కల్లూరు గ్రామములోని వాగు రోడ్డు పై నుండి ప్రవహించడంతో రాయికల్ వెళ్లాలంటే కోరుట్ల నుండి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కథలాపూర్ మండలంలో చెరువులు నిండిపోయాయి. సిరికొండ గ్రామా చెరువు నిండి వరద నీరు కోరుట్ల ప్రధాన రోడ్డు మీద నుండి ప్రవహిస్తుంది. కొంత నీరు గ్రామములో చేరుతుంది దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. సిరికొండ, ఏకీన్పూర్ గ్రామాల మధ్య ఆయిల్ ఒర్రె ఉదృతంగా ప్రవహిస్తుంది. దీంతో వేములవాడ రోడ్ ను పోలీసులు మూసివేశారు. మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామా చెరువు నిండి నీరు రోడ్డుపై ప్రవహిస్తుంది. దీంతో రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు. ఏదైమైనా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు సామాన్య ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నీటి ప్రవాహాల వద్ద పోలీసులు పహారా నిర్వహిస్తున్నారు.