- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అకాల వర్షం.. రైతులకు అపార నష్టం

దిశ, కాల్వ శ్రీరాంపూర్ : మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం రాత్రి సమయంలో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కురిసిన వానకు వరి పంట నేలరాలింది. మామిడి తోటల్లో కాయలు పూర్తిగా రాలిపోవడంతో యజమానులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అలాగే పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. మండలంలోని పెద్దరాతు పల్లి, శ్రీరాంపూర్, చిన్నరాతుపల్లి, మొట్లపల్లి గ్రామాల్లో వరి పంట నేలరాలగా, మామిడి తోటలో నేలరాలిన మామిడికాయలను, వరి పంటలను వ్యవసాయ అధికారులు, హార్టికల్చర్ అధికారులతో కలిసి మాజీ ఎంపీపీ గొపగోని సారయ్య గౌడ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు గాజునవేన సదయ్య నాయకులు పరిశీలించారు. పంట తీవ్రతను అంచనా వేసి, నష్టపోయిన రైతాంగాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు దృష్టికి తీసుకువెళ్లి నష్టపోయిన రైతులందరిని ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని అన్నారు.