టీఆర్ఎస్‌ను తొడకొట్టి సవాల్ చేసిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్..

by Dishafeatures2 |
టీఆర్ఎస్‌ను తొడకొట్టి సవాల్ చేసిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్..
X

దిశ ,శంకరపట్నం: టీఆర్ఎస్ వెధవల్లారా గ్రామాల్లో దేశానికి వెన్నెముకై ప్రజలకు అన్నం పెడుతున్న రైతులను దోచుకుంటే కనబడడం లేదా అని కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు తెలంగాణ ప్రదేశ్ కమిటీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ గౌడ్ టీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. శనివారం మండలంలోని మొలంగూర్ శివారులో గల శ్రీ లక్ష్మీ ప్రసన్న గార్డెన్స్ ఫంక్షన్ హాల్‌లో శంకరపట్నం మండల శాఖ అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్ అధ్యక్షతన మండల కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో తాడికల్ శివారు నుండి నాయకులకు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికి బైక్ ర్యాలీగా సమావేశ స్థలానికి చేరుకున్నారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీ, టీపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడారు.

దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చామని రాష్ట్రం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ప్రతి కార్యకర్త సగౌరవంగా ప్రజలకు ఓటర్లకు వివరిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల వరకు సత్తా చాటేందుకు సైనికుల్లా పని చేయాలన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలుకు 8 కిలోల వరకు దేశానికి అన్నం పెట్టే రైతులను దోచుకుంటున్నా టీఆర్ఎస్ నేతలు వెధవల్లా చూస్తున్నారని తొడగొట్టి సవాల్ విసిరారు. కాంగ్రెస్ కార్యకర్త ప్రభుత్వ వైఫల్యాలను దోపిడిని నేతల దోపిడీని ప్రజలకు వివరిస్తూ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేయాలని కోరారు. కార్యకర్తలకు అండగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, మండల శాఖ అధ్యక్షుడు బసవయ్య గౌడ్, మాజీ జెడ్పిటిసి సీనియర్ కాంగ్రెస్ నాయకులు బత్తిని శ్రీనివాస్ గౌడ్, నియోజకవర్గం ఇంచార్జి మల్లేష్ గౌడ్, ఎస్సీ సెల్ మండల శాఖ అధ్యక్షులు బొజ్జ చంద్రమౌళి, బీసీ సెల్ మండల శాఖ అధ్యక్షుడు గొర్ల కొమురయ్య, మైనార్టీ సెల్ మండల శాఖ అధ్యక్షుడు జహంగీర్, మహిళ అధ్యక్షురాలు చిన్తరెడ్డి పద్మా, ప్రధాన కార్యదర్శి నాంపల్లి తిరుపతి, యూత్ అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్, మానకొండూర్ నియోజకవర్గం యూత్ ప్రధాన కార్యదర్శి ఈసామొద్దిన్, మండలంలోని అన్ని గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు అనుబంధ సంఘాల నాయకులు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Next Story