ఓటును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి..

by Disha Web Desk 13 |
ఓటును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి..
X

దిశ, సుల్తానాబాద్: ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని వినియోగించుకోవాలని అవగాహన సదస్సులో పలువురు అధికారులు వెల్లడించారు. సోమవారం మున్సిపల్ పరిధిలోని ఓటు హక్కు పై స్వీప్ ఆధ్వర్యంలో ఫ్లాకార్డులతో అవగాహన ర్యాలీని స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి కమిషనర్ టి. మల్లికార్జున్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా మీదిగ రాజీవ్ రహదారి నుండి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి ర్యాలీగా చేరుకుని మానవహారం చేపట్టారు.


అనంతరం పలువురు అధికారులు మాట్లాడుతూ.. భారత దేశంలో ఓటు హక్కు ద్వారానే రాష్ట్రాన్ని దేశాన్ని పాలించే వారిని ఎన్నుకునే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరు తమ ఓటును వినియోగించుకోవాలని, ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు విధిగా ఓటును వేయాలని సూచించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకునేందుకు అర్హులని తెలిపారు. మండలంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో తహాశీల్దార్ మధుసూదన్ రెడ్డి, ఎంపీడీవో శశికళ, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ రావు, ఎస్సై మాధవి, శ్రీవాణి కళాశాల ప్రిన్సిపాల్ బండారి కమలాకర్, ఏ ఎన్ ఎం లు, ఆశ వర్కర్లు, బీఎల్‌ఓ లు, ఆర్పీలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story