జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు : ఎన్నికల అధికారిణి

by Aamani |
జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు : ఎన్నికల అధికారిణి
X

దిశ,జగిత్యాల : జగిత్యాల జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యిందని జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా వెల్లడించారు. గురువారం జరిగిన పోలింగ్ సందర్భంగా జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గంలో ఉదయం నుంచి ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరి నిలబడి ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొన్నారని తెలిపారు.మూడు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు అందిన సమాచారం మేరకు 74.87 శాతం మంది ఓటు వేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ మేరకు జగిత్యాల నియోజకవర్గంలో 73.54శాతం, కోరుట్ల నియోజకవర్గంలో 73.68 శాతం, ధర్మపురి నియోజకవర్గంలో 77.50 శాతం పోలింగ్ జరిగిందని తెలిపారు.

జిల్లాలోని 785 పోలింగ్ కేంద్రంలో, జిల్లా యంత్రాంగం, పోలీసుల సహకారంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగిందని పేర్కొన్నారు. 234 మంది మైక్రో అబ్జర్వర్లను ద్వారా ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జగిత్యాల జిల్లాలో శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను అందరి సహకారంతో విజయవంతం చేయగలిగామని...ఇందుకుగాను సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.ఎన్నికల సాధారణ పరిశీలకులు రాజీవ్ రంజన్ మీనా, హెచ్. బసవ రాజేంద్ర, పోలీస్ పరిశీలకులు వివేకానంద సింగ్ లు ఎన్నికల నిర్వహణ తీరుపై కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన వెబ్ కంట్రోల్ రూం ద్వారా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమాలలో జిల్లాలోని అధికారులు, సిబ్బంది, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed