కొండగట్టు పవన్ పర్యటనలో విలేకరుల పట్ల డీఎస్పీ దురుసు ప్రవర్తన..

by Disha Web |
కొండగట్టు పవన్ పర్యటనలో విలేకరుల పట్ల డీఎస్పీ దురుసు ప్రవర్తన..
X

దిశ, మల్యాల: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చిన సందర్భంగా కవరేజ్ కోసం వెళ్లిన జర్నలిస్టులతో పాటు అభిమానుల పట్ల జగిత్యాల డీఎస్పీ ఆర్ ప్రకాష్ దురుసుగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. కవరేజ్ కోసం వెళ్లిన జర్నలిస్టులను బయటకు వెళ్లాల్సిందిగా డీఎస్పీ కోరగా నిరాకరించిన కొంత మందిని బలవంతంగా బయటకు పంపించేశారు. డీఎస్పీ వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో భాగంగా కవరేజ్‌కి వెళ్లిన జర్నలిస్టులపై డీఎస్పీ వ్యవహరించిన తీరును పలువురు తప్పుబడుతున్నారు.Next Story