మద్యం మత్తులో లారీ డ్రైవర్ హంగామా..

by Disha Web |
మద్యం మత్తులో లారీ డ్రైవర్ హంగామా..
X

దిశ, మంథని: మంథని మండలం ఎగ్లాస్పూర్ ప్రధాన రహదారిపై మద్యం మత్తులో లారీ డ్రైవర్ బుధవారం హంగామా సృష్టించాడు. రోడ్డుపై వాహనాలు నిలిచిపోవడంతో ఈ విషయం తెలుసుకున్న మంథని పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇసుక క్వారీ నుండి వస్తున్న లారీల డ్రైవర్లు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత లారీ డ్రైవర్ ను డ్రంక్ అండ్ డ్రైవ్ తో పరిశీలించగా మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిపై డ్రంకెన్ డ్రైవ్ కేసు నమోదు చేసినట్టు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. లారీని సీజ్ చేసినట్టు ఎస్సై తెలిపారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసినట్లయితే వారి డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దుచేసి వాహనాలను సీజ్ చేస్తామని ఎస్సై హెచ్చరించారు.


Next Story