అక్రమ కేసులు పెడుతున్నారని లారీ ఓనర్ ఏం చేశాడో తెలుసా

by Sridhar Babu |
అక్రమ కేసులు పెడుతున్నారని లారీ ఓనర్ ఏం చేశాడో తెలుసా
X

దిశ, పెద్దపల్లి : నెల నెలా మామూళ్లు అడుగుతున్నారని, ఇవ్వకపోతే కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపిస్తూ లారీ ఓనర్ నిరసనకు దిగాడు. శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయం వద్ద లారీపైకి ఎక్కి విద్యుత్ తీగలు పట్టుకుంటానని బసంత్ నగర్ కు చెందిన లారీ ఓనర్ అనిల్ గౌడ్ నిరసనకు దిగాడు. ఆర్టీఏ అధికారులు మామూళ్లు ఇవ్వనందుకు తన లారీపై కేసు నమోదు చేసినట్టు, ఒక్కో లారీకి నెలకు రూ.8000 లంచం వసూలు చేస్తున్నట్టు ఆరోపించాడు. ఇప్పటికైనా అధికారులు మామూళ్లు వసూలు చేయడం మానుకోవాలని డిమాండ్ చేశారు. కిందికి దిగాలని రవాణా శాఖ సిబ్బంది విన్నవించినా అనిల్ గౌడ్ ఒప్పుకోకపోవడంతో పాటు తనను లంచం అడిగిన అధికారులను సస్పెండ్ చేస్తేనే దిగుతానని పేర్కొన్నారు.

Next Story

Most Viewed