క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ

by Disha Web Desk 23 |
క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ
X

దిశ,గంభీరావుపేట : ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా జిల్లా లో పకడ్బంది భద్రత ఏర్పాట్లు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ అన్నారు. సోమవారం రోజున గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు అయిన నాగంపేట,ముస్తఫా నగర్, గంభీరావుపేట,కొత్తపల్లి గ్రామాలను సందర్శించి క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన భద్రతా చర్యల మీద అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... జిల్లాలో క్రిటికల్ గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునెల తగిన బందోబస్తు చర్యలను తీసుకోనున్నట్లు తెలిపారు.పోలీస్ సిబ్బంది విసిబుల్ గా ఉంటూ క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను నిరంతరం సందర్శిస్తూ అక్కడి ప్రజలకు ప్రశాంత వాతావరణంలోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎటువంటి గొడవలు లేకుండా ఎన్నికలను సజావుగా నిర్వహించేలా తోడ్పాటు అందించాలని అవగాహన కల్పించాలన్నారు.క్రిటికల్ ప్రాంతాల్లో వీలైనంత ఎక్కువగా ఫ్లాగ్ మార్చ్, రూట్ మార్చ్, వాహన తనిఖీలు, లు నిర్వహించి ఓటర్ల కు భద్రతా భావాన్ని కలిగించాలన్నారు.ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న సందర్భంగా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని,ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు.

పెద్దమ్మ చెక్ పోస్ట్ ఆకస్మిక తనిఖీ..

అనంతరం పెద్దమ్మ చెక్ పోస్ట్ తనిఖీ చేసి వాహన తనిఖీలు చేసి వాహనాలను నమోదు చేసిన రిజిస్టర్ ను పరిశీలించడం తో పాటు, ప్రత్యక్షంగా పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీలు చేస్తున్న తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. తనిఖీల సమయంలో సిబ్బంది అప్రమత్తం గా వ్యవహారించడంతో పాటు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేసి అక్రమ నగదు, మద్యం రవాణాను అరికట్టాలని సూచించారు. ఎస్పీ వెంట సీఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐ మహేష్ ఉన్నారు.

Advertisement

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channelNext Story