పంట నష్టం పై పరిహారం అందించాలని బీజేపీ నాయకుల ప్రెస్ మీట్..

by Disha Web Desk 20 |
పంట నష్టం పై పరిహారం అందించాలని బీజేపీ నాయకుల ప్రెస్ మీట్..
X

దిశ, గంభీరావుపేట : గంభీరావుపేట మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గురువారం రోజున ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మహేష్ యాదవ్ మాట్లాడుతూ ఈసారి పంటకు తెగుళ్ళు వచ్చి కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేని సమయంలో అకాల వర్షాలు రైతుకు కన్నీళ్లే మిగిల్చాయి. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన పంటలను సర్వేచేయించి ఎకరానా 10,000 రూపాయల నష్టపరిహారం ఇస్తా అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పి దాదాపు నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు అధికారులకు పంటనష్టానికి సంబందించిన సర్వే చేయమని ఎటువంటి ఆర్డర్స్ ఇవ్వకుండా కాలయాపన చేస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ విధమైన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు.

చనిపోయిన రైతులకు 5 లక్షల పరిహారం ఇచ్చే ప్రభుత్వం బ్రతికి ఉండి అప్పులు తెచ్చి పంట వేసిన రైతుల గురించి ఇంకా ఎంత ఆలోచించాలి ఎన్ని విధాలా ఆదుకోవాలి అంటే మీరు శవ రాజకీయం చేస్తున్నారా అని ఆడుగుతావున్నరు. ఇప్పటికి కొన్ని గ్రామాల్లో కోతలు ప్రారంభం అయ్యాయి కోతలు అయినా తర్వాత వచ్చే గడ్డిని లేక కొయ్యకాళ్లను సర్వే చేస్తారా మీరు ఇచ్చే హామీలు అన్ని మోసపూరిత మాటలు వాటివల్ల జనాలకు ఎటువంటి ఉపయోగం లేదు ఇప్పటికైనా పంట నష్టాన్ని సర్వే చేయించి, నష్ట పరిహారం అతి త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పెద్దఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మహేష్ యాదవ్, జిల్లా మైనారిటీ అధ్యక్షులు వాజీద్, జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులు పర్శరాం గౌడ్, మండల ఉపాధ్యక్షులు రాజిరెడ్డి, రమేష్, శ్రీనివాస్ రెడ్డి, గణేష్ రెడ్డి, రాము, శ్రీనివాస్ యాదవ్, రేపాక రాజు, బాబు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Next Story