సుపరిపాలనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం.. డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్

by Dishafeatures2 |
సుపరిపాలనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం.. డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్
X

దిశ,పెగడపల్లి: మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ కేంద్ర ప్రభుత్వం, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్య పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయ్యాయని డీసీసీ అధ్యక్షుడు, ధర్మపురి నియోజక వర్గ ఇంచార్జి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. ధర్మపురి లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి హాథ్ సే హాథ్ జోడో యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని ఏకం చేసేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని వారికి మద్దతుగా హాథ్ సే హాథ్ జోడో యాత్ర చేస్తున్నామని తెలిపారు. ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ ధర్మపురి క్షేత్రంలో పూజలు, యాగాలు చేసి ఆలయ అభివృద్ధికి 500 కోట్ల నిధులు ఇస్తానని చెప్పి మాటతప్పారని మండిపడ్డారు. యాదాద్రిని మాత్రం అభివృద్ధి చేసి ధర్మపురిని కేసీఆర్ పట్టించుకోలేదని ఆరోపించారు.


ఇప్పటికీ ధర్మపురిని రెవెన్యూ డివిజన్ గా చేయలేదని, ఐటిఐ కళాశాల తేలేదని, డిగ్రీ కళాశాల హామీ ఏమైందని దుయ్యబట్టారు. గోదావరి చెంతనే ఉన్న ధర్మపురి ప్రజలెకు నీళ్లు అందవని తెలిపారు. లిఫ్ట్ ద్వారా ఇక్కడి నీళ్లను మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ కు తరలిస్తుంటే స్థానిక ఎమ్మెల్యే కొప్పుల ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. భూనిర్వాసితులకు పరిహారం ఇప్పించడంలో మంత్రి కొప్పుల ఫెయిల్ అయ్యారని విమర్శించారు. కేంద్రం ప్రభుత్వ సంస్థలను ఒక్కొకటిగా ప్రైవేట్ పరం చేస్తూ.. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ యాత్రలో ఆయన వెంట నియోజకవర్గంలోని పలు మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed