అసైన్డ్ భూములకు పంట రుణం ఇవ్వాలి : పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

by Dishanational2 |
అసైన్డ్ భూములకు పంట రుణం ఇవ్వాలి : పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
X

దిశ, బీర్పూర్: బీర్పూర్ మండల కేంద్రంలో మంగళవారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. బీర్పూర్ మండలంలోని సమస్యలను పరిష్కరించేందుకు ఆర్డీఓ స్థాయి అధికారిని నియమించి, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని, వరదల్లో కొట్టుకుపోయిన మోటర్ల రైతులకు పరిహారం అందించాలని సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రాజుల చెరువుగా పిలిచే రోళ్ళ వాగును కాంగ్రెస్ పాలనలో ఎస్సారెస్పీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా తీర్చిదిద్ది, బీర్పూర్ మండలంలో అన్ని గ్రామాలతో పాటు ధర్మపురి మండలానికి కూడా సాగు వసతి కల్పించేందుకు ఏర్పాటు చేశా మన్నారు.

సాగునీరందని మంగేల, రేకులపల్లి, చిత్రవేని గూడెం, కమ్మునూరు, కొల్వాయి, రంగసాగర్, గ్రామాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేశామన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు కన్నా ముందే అనుమతులు పొందిన నిర్మాణంలో జాప్యం రోళ్ళ వాగు ఆధునికీకరణ పేరిట 2015 లోనే కాలేశ్వరం ప్రాజెక్టు కన్నా ముందుగానే అనుమతులు పొందినప్పటికీ నిర్మాణంలో జాప్యంతో అంచనా వ్యయం పెరిగిపోయింది సాంకేతిక లోపంతో భాన్డ్ నిర్మాణం కన్నా ముందే మత్తడి నిర్మాణం చేయడం, వందలాది వ్యవసాయ మోటర్లు, కోట్లాది రూపాయల మత్స్య సంపద కొట్టుకపోయిందన్నారు. మత్స్యకారులకు ఉపాధి కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఎటువంటి సహాయ చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. ప్రకృతి విపత్తులతో కేంద్రం నుండి సాయం పొందే అవకాశం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక సమర్పించకపోవడంతో పరిహారం అందలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులను పట్టించుకోవడం లేదని విమర్శించారు .

రైతులు పంటలు పండించిన దానికన్నా అమ్ముకునేందుకు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది

రైతులు ఆరుగాలం పండించిన పంట కన్నా పంట విక్రయించేందుకు ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి నెలకొందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు ఒక్కో బస్తకు రెండు కిలోలు చొప్పున కింటాకు 5 కిలోలు అదనపు తూకం వేస్తున్నారని స్థానిక అధికారులు పర్యవేక్షించి అన్లోడింగ్ సమస్యలు లేకుండా చూడాలని అన్నారు.

మిషన్ భగీరథ నీరు నిరుపయోగం

క్లోరినేషన్ చేసిన మిషన్ భగీరథ నీరు 20 కిలోమీటర్ల తర్వాత జీరో అవుతుందని దీంతో మిషన్ భగీరథ నీరు ఉన్న నిరుపయోగమేనని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. బీర్పూర్ లో వినియోగంలో ఉన్న ఫిల్టర్ బెడ్లలను పక్కన పెట్టారని, దీంతో ప్రజలకు ఇటు మిషన్ భగీరథ నీరు తాగలేక ఆటు స్వచ్ఛమైన శుద్ధి చేసిన నీరు అందక కలుషితమైన నీరు తాగాల్సిన దుస్థితి నెలకొంది అన్నారు.

అసైన్డ్ భూములకు పంట రుణం ఇవ్వాలి

బీర్పూర్ మండలంలోని అసైన్డ్ భూములకు పంట రుణాలు ఇవ్వడం లేదని దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైతుబంధు పొందుతున్న అసైన్డ్ భూముల పట్టాదారు రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్న బ్యాంకు అధికారులు పంట రుణాలు ఇవ్వడం లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లిన స్పందన లేదని వాపోయారు. బీర్పూర్ మండలం పై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జీవన్ రెడ్డి అన్నారు. బీర్పూర్ సమస్యలపై ఆర్డీవో స్థాయి అధికారులు నియమించి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలి డిసెంబర్ 7న జగిత్యాల జిల్లా కేంద్రానికి సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో మత్స్యకారుల సమస్యలు వరదలతో పొలాల్లో ఇసుక మేటల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇ సమావేశంలో ఎంపీపీ మసార్తి రమేష్, జడ్పిటిసి పాత పద్మా రమేష్, వైస్ ఎంపీపీ లక్ష్మణరావు, పి ఎస్ సి ఎస్ చైర్మన్ నవీన్ రావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుభాష్ యాదవ్, ఉమ్మడి మండల ప్రచార కార్యదర్శి గుడిసె సుభాష్ యాదవ్, ఎంపీటీసీలు రంగు లక్ష్మణ్, అడెపు మల్లేశ్వరి తిరుపతి, ఏనుగు జోగి రెడ్డి, భైరవేని సత్యనారాయణ, తోట శ్రీనివాస్, రాజేశం, అభిలాష్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed