- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కరీంనగర్ ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి
దిశ, హుజురాబాద్ రూరల్ : కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్ర శనివారం హుజూరాబాద్ మండలంలోని చెల్పూర్, జూపాక గ్రామాల్లో సాగింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీ గెలిపించి సత్తా చాటాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్రం నుండి అధిక నిధులు తీసుకొచ్చి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కరీంనగర్
పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల ప్రధాని మోడీకి, జాతీయ నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అవినీతి కప్పిపుచ్చుకునేందుకు డ్రామాలాడుతుందని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కై 6 గ్యారంటీలు అమలు కాకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. కాలేశ్వరంలో అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ ను జైల్లో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల సాకుతో కాంగ్రెస్ ప్రభుత్వం దాటవేసే ధోరణి ప్రదర్శిస్తుందని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిస్తే నరేంద్ర మోడీ ప్రధాని అవుతారని, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎవరు ప్రధాని అవుతారో చెప్పే ధమ్ము ఉందా అని కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆయన ప్రశ్నించారు.