కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం.. నదిమ్ జావేద్..

by Disha Web Desk 20 |
కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం.. నదిమ్ జావేద్..
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : దళిత బంధు పేరిట సీఎం కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని ఏఐసీసీ రాష్ట్ర కార్యదర్శి నదిమ్ జావేద్ ద్వజమెత్తారు. స్థానిక ఇందిరా భవన్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నీ ఎస్సీ, ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్ గా పేరు మార్చి ఆ నిధులు ఖర్చు చేయకుండా సీఎం కేసీఆర్ దళితులను దగా చేస్తున్నారని ఇప్పుడు మళ్లీ నియోజకవర్గానికి 1500 మంది చొప్పున దళిత బంధు అందిస్తామని మరోమారు దగా చేస్తున్నారని మండిపడ్డారు. ముప్పై వేల కోట్లు ఖర్చు చేస్తే ఇండ్లు లేని దళితులే ఉండరని సూచించారు. దళిత బంధు పథకం పూర్తిస్థాయిలో అమలు అవడం లేదని లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇవ్వడం తప్ప వాటి అమలు జరగడం లేదని ఇప్పటికైనా దళిత సమాజం కేసీఆర్ మోసాన్ని గుర్తించాలని కోరారు.

కర్ణాటక రాష్ట్రంలో మతతత్వ బీజేపీని ప్రజలు తమ ఓటుతో బుద్దిచెప్పారని అవే ఫలితాలు తెలంగాణలో పునరావృతం అవుతాయని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే అని తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలను మభ్య పెట్టడంలో సీఎం కేసీఆర్ ని మించిన వారు లేరని విమర్శించారు. దళితులు ఏ విధంగా దగా చేయబడుతున్నారు అనేది బహిరంగ లేఖ విడుదల చేశారు. రాష్ట్ర బడ్జెట్ లో 17,700 కోట్లు కేటాయించిన ఒక్కరికీ కూడా దళిత బంధు ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పీసీసీ సభ్యులు గిరి నాగభూషణం, బండ శంకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాజేంగి నందయ్య, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్లేపళ్ళీ దుర్గయ్య, నాయకులు చాంద్ పాషా, మన్సూర్, నేహాల్, గుండా మధు, పుప్పాల అశోక్, మారు గంగారెడ్డి, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.



Next Story