- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Collector Sandeep Kumar Jha : నిర్ధిష్టమైన లక్ష్యాన్ని ఎంచుకొని కష్టపడి చదవాలి
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : విద్యార్థులు తమ జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు నిర్ధిష్టమైన లక్ష్యాన్ని ఎంచుకొని దానికి అనుగుణంగా కష్టపడి చదవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకాంక్షించారు. సోమవారం బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, వంట గది, విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాల తీరును, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను కలెక్టర్ స్వయంగా పరిశీలించి, విద్యార్థులు, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. పాఠశాలల్లో వసతులు, సదుపాయాల తీరుపై ఆరా తీశారు.
ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని విద్యార్థులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. తరగతి గదుల్లో విద్యార్థులకు పాఠ్యాంశాలోని ప్రశ్నలను సంధించి, సమాధానాలు రాబట్టారు. విద్యార్థుల సమాధానాల పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనం ఎలా ఉందని ప్రశ్నించారు. ఏ తరగతిలో ఎంత మంది విద్యార్థులు హాజరయ్యారని ఉపాధ్యాయులను కలెక్టర్ ఆరా తీశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్య బోధన అందించడమే ప్రభుత్వ సంకల్పమన్నారు. తమ తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చేలా ప్రతి విద్యార్థి కష్టపడి చదివి, జీవితంలో ఉన్నతమైన స్థానాలను అధిరోహించాలని పేర్కొన్నారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆయన వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉషారాణి, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.