CM KCR : రేపటి సీఎం టూర్ షెడ్యూల్ ఇదే..

by Dishanational1 |
CM KCR : రేపటి సీఎం టూర్ షెడ్యూల్ ఇదే..
X

దిశ, కరీంనగర్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ కూతురు వివాహానికి హాజరయ్యేందుకు ప్రత్యేకంగా రానున్నారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్ లో బయలుదేరనున్న సీఎం స్థానిక స్పోర్ట్స్ స్కూల్ ఆవరణలోని హెలిప్యాడ్ లో దిగుతారు. అక్కడి నుండి నేరుగా వీ కన్వెన్షన్ లో జరుగుతున్న రవీందర్ సింగ్ కూతురు వివాహానికి హాజరై కొద్దిసేపు అక్కడే ఉంటారు. ఆ తర్వాత మంత్రి గంగుల కమలాకర్ ఇంటికి చేరుకొని 20 నిమిషాల పాటు అక్కడే ఉండి బయలుదేరుతారు. స్పోర్ట్స్ స్కూల్ హెలీప్యాడ్ కు చేరుకుని హెలికాప్టర్ లో నేరుగా హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు.

Also Read: BRS కు బ్రేక్.. కేసీఆర్‌కు వరంగల్ వాసి షాక్?




Next Story

Most Viewed