108లో ప్రసవం..చాకచక్యంగా వ్యవహరించిన అంబులెన్స్ సిబ్బంది

by Aamani |
108లో ప్రసవం..చాకచక్యంగా వ్యవహరించిన అంబులెన్స్ సిబ్బంది
X

దిశ, రాయికల్ : 108 వాహనంలో ప్రసవం పోసి ఆపద్భాంధువులుగా మరీనా ౧౦౮ సిబ్బంది. వివరాల్లోకి వెళితే రాయికల్ పట్టణానికి చెందిన చర్ల లావణ్య సోమవారం వేకువ జామున పురిటి నొప్పులు రాగ కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వచ్చారు. అక్కడున్న సిబ్బంది పరీక్షించి డాక్టర్ , సిస్టర్ ఇతర సిబ్బంది అందుబాటులో లేరని జగిత్యాల వెళ్ళమని సూచించడంతో లావణ్య బంధువులు 108 వాహనానికి సమాచారం అందించగా వెంటనే వాహనం ఆసుపత్రికి చేరుకొని గర్భిణీ లావణ్య ని జగిత్యాల ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో లావణ్యకు నొప్పులు అధికమై బాధపడుతుండంతో ఆమెకు 108 వాహనంలో పనిచేసే ఈఎంటి రామ్,పైలట్ మహేష్ లు పురుడు పోశారు. లావణ్యకు ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆపద సమయంలో ఆపద్భాంధువులుగా మరీనా వీరిని లావణ్య బంధువులతో పాటు మేనేజర్ సలీం, సూపర్వైజర్ రాజశేఖర్ లు ఈఎంటి రామ్,పైలట్ మహేష్ లను అభినందించారు. ఎంతో ప్రసిద్ధి గాంచిన రాయికల్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యం వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story