108 లోనే ప్రసవం.. తల్లి బిడ్డ క్షేమం

by Disha Web Desk 23 |
108 లోనే ప్రసవం.. తల్లి బిడ్డ క్షేమం
X

దిశ, ముస్తాబాద్ : 108 అంబులెన్స్ లో ఓ తల్లి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఘటన మండలం లో చోటుచేసుకుంది. నామాపూర్ గ్రామానికి చెందిన యారటి నాగలక్ష్మి సోమవారం పురిటి నొప్పులతో బాధపడుతున్న విషయం 108 కి కుటుంబ సభ్యులు తెలపడం తో 108 సిబ్బంది ఈ ఎం టి మహేష్ , పైలట్ వెంకటేష్ లు నాగ లక్ష్మి ని అంబులెన్స్ లో ఎక్కించారు. నామపూర్ నుండి పోతుగల్ పీహెచ్సికి తరలించే మార్గ మధ్యంలో నొప్పులు ఎక్కువ కావడం తో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ మహేష్ ఆశా వర్కర్ గంగ సహయ తో అంబులెన్స్ లోనే సాధారణ ప్రసవం చేశాడు.అనంతరం వారిని పీ హెచ్ సి లో చేర్పించి సకాలంలో చికిత్స అందించడం తో తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు.పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన నాగలక్ష్మి, కుటుంబ సభ్యులు ,వైద్య బృందం మహేష్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Next Story