బెల్ట్ షాపు ఉత్సవాలు మరచిపోయారా.. పొన్నం ప్రభాకర్ గౌడ్

by Sumithra |
బెల్ట్ షాపు ఉత్సవాలు మరచిపోయారా.. పొన్నం ప్రభాకర్ గౌడ్
X

దిశ, హుజూరాబాద్ : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం బెల్ట్ షాపు ఉత్సవాలను మరచిపోయిందంటూ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ ఎద్దేవా చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండల కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దశాబ్ది ధగాపేరిట తెలంగాణలోని అన్ని నియోజకవర్గల్లో ప్రభుత్వ దిష్టి బొమ్మ దహన కార్యక్రమాలను గురువారం నుండి చేపడతామన్నారు. కేసీఆర్ పాలనలో ఇసుక, ల్యాండ్ మాఫియా పెట్రేగిపోయిందన్నారు. టీడీపీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించిన మంత్రి గంగుల కమలాకర్ దిగజారుడు మాటలు మానుకోవాలని హితవు పలికారు.

సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తాను ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడకుండా ఎంపీగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పాటుపడిన సంగతి గుర్తు చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ సీఎం తనయ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ ఎంపీగా, పార్లమెంట్ పరిధిలో ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ బోయినపల్లి వినోద్ కుమార్ కరీంనగర్ ఎంపీగా ఎందుకు ఓటమి చెందారో చెప్పాలని మంత్రి గంగుల కమలాకర్ ను ప్రశ్నించారు. మంత్రి గంగుల, బీజేపీ తెలంగాణ చీప్ బండి సంజయ్ ఆలయాలలో కలుసుకుంటూ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. మహాలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని, గంగుల, సంజయ్ కుమార్ సిద్ధమా అని ప్రభాకర్ సవాల్ విసిరారు. ఈ సమావేశంలో నాయకులు పత్తి కృష్ణారెడ్డి, బాలసాని రమేష్, తిప్పారపు సంపత్, సారంగపాణి, గూడూరి స్వామిరెడ్డి, సాయిని రవి, కొలిపాక శంకర్, శివా గౌడ్ , మిడిదొడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story