దశాబ్ధి ఉత్సవాలను బహిష్కరిస్తున్నాం : లక్ష్మీపురం గంగపుత్రులు

by Disha Web Desk 1 |
దశాబ్ధి ఉత్సవాలను బహిష్కరిస్తున్నాం : లక్ష్మీపురం గంగపుత్రులు
X

దిశ , జగిత్యాల ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా నేడు నిర్వహించే చెరువుల పండగ, ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ మత్స్యకార సంఘం అధ్యక్షుడు బాధ దేవరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్స్య సహకార సంఘం ఏర్పడి 1964 నుంచి ఇప్పటి వరకు చైర్మన్, అధ్యక్షుడిగా గంగపుత్రులే కొనసాగుతున్నారని తెలిపారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మొట్ట మొదటిసారిగా ముదిరాజ్ కులస్థులకు చైర్మన్ పదవిని కట్టబెట్టారని తెలిపారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వం గంగపుత్ర జాతికి చేసిన ద్రోహమే అని మండిపడ్డారు. అందులో భాగంగా గడచిన ఎనమిది రోజులను ప్రకటిస్తున్నామని, దశాబ్ధి ఉత్సవాలను బహిష్కరిస్తున్నామంటూ గంగమ్మ ఆలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు గజ్జి రాజేష్, ప్రధాన కార్యదర్శి మైలారం వినయ్, గజ్జి మల్లేష్, కులస్థులు పాల్గొన్నారు

Next Story

Most Viewed