నిరుద్యోగ భృతిని వెంటనే చెల్లించాలి: బీజేవైఎం

by Dishanational1 |
నిరుద్యోగ భృతిని వెంటనే చెల్లించాలి: బీజేవైఎం
X

దిశ, శంకరపట్నం: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ భృతిని వెంటనే చెల్లించాలని బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు, కేశవపట్నం ఎంపీటీసీ-2 ఏనుగు నాని డిమాండ్ చేశారు. బీజేవైఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలో నిరుద్యోగ భృతి, ఖాళీగా ఉన్న శాఖలో ఉద్యోగాల నియామకం కోసం, నోటిఫికేషన్ల నియామకాలను వెంటనే జరపాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బీజేవైఎం మండల శాఖ అధ్యక్షుడు బొడిగె నరేష్ శంకరపట్నం తహశీల్దార్ కార్యాలయం ఎదుట భారీ నిరసన కార్యక్రమం చేపట్టి, ఓ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్ మాట్లాడారు. తెలంగాణలో ముఖ్యమంత్రిగా 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కూడా చంద్రశేఖర్ రావు రాష్ట్ర యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా విస్మరిస్తున్నాడని, యువతను మభ్య పెట్టేందుకు నిరుద్యోగ భృతిగా 3016 రూపాయలు చెల్లిస్తామని, నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చి 48 నెలలు గడిచినా చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తక్షణమే నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతిని చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలో ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శంకరపట్నం తహశీల్దార్ కార్యాలయం ఎదుట బీజేవైఎం మండల శాఖ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టి డిప్యూటీ తహశీల్దారు శ్రీకాంత్ కు తెలంగాణలోని నిరుద్యోగుల సమస్యలు తీర్చాలని వినతి పత్రాన్ని అందజేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు చల్ల ఐలయ్య, బీజేవైఎం మండల శాఖ అధ్యక్షుడు బొడిగ నరేష్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మాడ వెంకట్ రెడ్డి, అధికార ప్రతినిధి సమ్మిరెడ్డి, నాయకులు దండు కొమరయ్య దాసారపు నరేందర్, జైపాల్, అనిల్, జగ్గారెడ్డి, వీరా అర్జున్, జగ్గారెడ్డి, రాజిరెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed