Balvanthapur: బీఆర్ఎస్ కండువాతో ఎంపీటీసీ ఫ్లెక్సీ..ఆగ్రహంతో చించివేత

by srinivas |   ( Updated:2023-05-27 04:24:37.0  )
Balvanthapur: బీఆర్ఎస్ కండువాతో ఎంపీటీసీ ఫ్లెక్సీ..ఆగ్రహంతో చించివేత
X

దిశ, మల్యాల: అధికారిక పార్టీ సర్పంచ్ ఏర్పాటు చేసిన కటౌట్లను, ఫ్లెక్సీలను ధ్వంసం చేసిన ఘటన బల్వంతపూర్‌లో జరిగింది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ హాజరవుతున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు గ్రామంలో రాజకీయ వేడిని పుట్టించాయి. ఎంపీటీసీ రవి బీఆర్ఎస్ కండువాతో ఉన్న ఫొటోలను ఫ్లెక్సీల్లో ముద్రించారు దీంతో ఆయన తీవ్రంగా ఖండించారు. ఐదు సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరానని చెప్పారు. ప్రస్తుతం బీజేపీ నాయకుడిగా, ఎంపీటీసీగా ఉన్నానని, తన పాత ఫోటోను ఫ్లెక్సీలో వేయడం ఆవేదన కలిగించిందని చెప్పారు. కార్యక్రమం మొదలు అయ్యే కంటే ముందే తన ఫొటోలు తొలగించాల్సిందిగా స్థానిక సర్పంచికి, జెడ్పీటీసీకి తెలిపానని చెప్పారు. అయితే వారు స్పందించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కొన్ని ఫ్లెక్సీలు తొలగించానిని తెలిపారు.

Advertisement

Next Story