- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశంలో బీజేపీకి మంచి స్కోప్ ఉంది : మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు
దిశ, కరీంనగర్ : హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధాని చేయాలని ఎప్పుడో భావించారని, దానిని సాధించేందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు అన్నారు. శుక్రవారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఈ విషయాన్ని అంబేద్కర్ ఏనాడో రాశాడని తన వ్యక్తిగత అభిప్రాయం కూడా అదేనన్నారు. రెండో రాజధానికి కావల్సిన అర్హతలన్ని హైదరాబాద్ నగరానికి ఉన్నాయని, మౌలిక వసతులు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు.
అంబేద్కర్ మనవడు కూడా ఇటీవల ఇదే విషయాన్ని వెల్లడించారని సాగర్ జీ ని గుర్తు చేశారు. బంగారు తెలంగాణ ఆకాంక్ష కూడా రెండో రాజధాని ఉపయోగప డుతుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉందని, తెలంగాణ రాజకీయాలపై అధ్యక్షుడు, పార్టీ నేతలు చర్చించి నిర్ణయం తీసుకుంటారని, క్రియాశీలక నిర్ణయాలు పార్టీ వెల్లడిస్తుందన్నారు. పార్టీకి ఏదో జరుగుతుందని అనుకోవడం సరికాదని, దేశంలో బీజేపీకి మంచి స్కోప్ ఉందని విద్యాసాగర్ రావు అన్నారు. ఫిక్స్ డిపాజిట్లలాగానే దేశ వ్యాప్తంగా ప్రధాని మోదీ పేరిట ఓట్లు ఉన్నాయని, మిగతా పార్టీల ఓట్లు జాయింట్ అకౌంట్లలో ఉంటాయని వాటిని విడిపించుకోవల్సిన సత్తా తమ పార్టీ నాయకులపై ఉందన్నారు.
మోదీ గొప్పదనాన్ని పునాదిగా తీసుకుని బీజేపీ ముందుకు సాగాలని సూచించారు. ఆయన పాలనలో భారత్ కు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందని, ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు అన్ని దేశాలు ప్రధాని మోదీ సలహాలు తీసుకుంటున్నాయని వివరించారు. రాజకీయాల్లో తాను క్రియాశీలకంగా లేనని, తాను సాధారణ బీజేపీ సభ్యుడిని మాత్రమేనని విద్యాసాగర్ రావు వ్యాఖ్యానించారు.