- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు ఖాయం’

దిశ, సుల్తానాబాద్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు ఖాయమని పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్న మైల్ అంజిరెడ్డి, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ మల్క కొమురయ్య లు అన్నారు. మంగళవారం సుల్తానాబాద్ పట్టణంలోని యశోద నరహరి ఫంక్షన్ హాల్ లో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు గా పోటీ చేసి గెలుపొందిన వీరికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్సీలుగా గెలుపొందిన ఇరువురికి శాలువాలు కప్పి గజమాలతో ఘనంగా సన్మానించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, కాసిపేట లింగయ్య , నాయకులు గోమాస శ్రీనివాస్ , మీసా అర్జున్ రావు, గొట్టేముక్కల సురేష్ రెడ్డి , గుర్రాల మల్లేశం అశోక్ రావు, సౌదరి మహేందర్, నాగరాజు, కందుల శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్, పలువురు పాల్గొన్నారు.