బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయి : కేటీఆర్

by Disha Web Desk 23 |
బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయి : కేటీఆర్
X

దిశ,రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు కుమ్మక్కయ్యి, బండి సంజయ్ ని గెలుపుకు కాంగ్రెస్ డమ్మి అభ్యర్థిని పెట్టిందాని, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో ప్రజలకే తెలియదని, బీఆర్ఎస్ పార్టీకే విజయావకాశాలున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో ఆయన క్లస్టర్ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో దేశానికే ఆదర్శంగా రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేసుకున్నామని, వ్యవసాయాన్ని పండుగల మార్చుకున్నామని తెలిపారు. ప్రతి ఇంటికి బీఆర్ఎస్ ప్రభుత్వ ఫలాలు అందించామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లోనే ప్రజల్లో అసహనం పెరిగిందని, కేసీఆర్ పాలనకు కాంగ్రెస్ పాలనకు తేడాను ప్రజలు తెలుసుకున్నారని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చి ఇన్నిరోజులు గడుస్తున్న ఎన్నికల హామీలను అమలు చేయని కాంగ్రెస్ పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం తిరుగుబాటుకు సిద్ధమయ్యారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు చీకటి దోస్తులని, అందుకే డమ్మీ అభ్యర్థిని కాంగ్రెస్ పోటీలో పెట్టిందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉందని, స్వార్థ నాయకులే పార్టీని వీడుతున్నారన్నారు. పోయిన వారి గురించి బాధపడేది లేదు. గ్రామీణ స్థాయిలో చురుకైన కార్యకర్తలను తయారు చేస్తామని ధీమా వ్యక్తంచేశారు.

మోడీ పాలనలో అన్నిటి ధరలు పెరిగాయని, మళ్ళీ టోల్ టాక్స్ వసూళ్లు చేస్తున్నారని, బండి సంజయ్ మత రాజకీయాలు తప్ప అభివృద్ధి మాట ఎత్తడని ఎద్దేవా చేశారు.బీఆర్ఎస్ పై ప్రజల్లో సానుభూతి ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ కి ఓటు వేయలేదని బాధ పడుతున్నారు. అందరం కలిసి గడప గడపకు వెళ్లి మాట్లాడితే మన విజయం పక్కా అవుతుంది. అధికారంలో ఉన్నప్పుడు లబ్ధి పొందిన నాయకులే కష్ట కాలంలో కేసీఆర్ ను వీడి పోతున్నారని, అయినప్పటికీ కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం ప్రజల్లోకి వస్తున్నాడని, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మే 10న సిరిసిల్లకు వస్తున్నట్లు తెలిపారు. ప్రచార సభకు నియోజకవర్గం నుంచి వేలాదిగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. పార్లమెంటు ఎన్నికల్లో మన అభ్యర్థి వినోద్ కుమార్ విజయం కోసం శ్రమించాలి విజ్ఞప్తి చేశారు. అంతకుముందు తంగళ్ళపల్లి మండలం తాడూరులో ఇటీవల ప్రమాదవశాత్తు దగ్ధమైన తాటి వనాన్ని పరిశీలించి, పెద్దూర్ లో ఎల్లమ్మ సిద్ధోగానికి హాజరయ్యారు.

Next Story

Most Viewed