సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ అనురాగ్ జయంతి

by Shiva |
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ అనురాగ్ జయంతి
X

దిశ, సిరిసిల్ల : సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పకడ్బందీ జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. నీరు నిలిచి ఉన్న పాడుబడిన బావుల్లో ఆయిల్ బాల్స్ వేయాలన్నారు.

మండల ప్రత్యేక అధికారులు క్షేత్ర స్థాయిలో పారిశుధ్య పరిస్థితిని సెక్రెటరీలు, క్షేత్ర స్థాయి అధికారులు, మహిళా సంఘాలతో సమీక్షించాలన్నారు. జిల్లాలోని అన్ని పట్టణాలు, అవాసలకు మిషన్ భగీరథ త్రాగునీరు సరఫరా చేయాలన్నారు. కలుషితం కాకుండా సురక్షిత త్రాగునీరు సరఫరా అవుతుందో లేదో మానిటర్ చేయాలన్నారు. ఆగస్ట్ 1న అన్ని గ్రామాలు, విద్యా సంస్థల్లో వాటర్ ట్యాంక్ లను క్లీన్ చేయించాలన్నారు. నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. అదేవిధంగా రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.

వర్షాలు సమృద్ధిగా కురిసినందున మొక్కలు నాటేందుకు ఇదే సరైన సమయమని కలెక్టర్ స్పష్టం చేశారు. తెలంగాణకు హరితహారం కింద అన్ని ప్రభుత్వ శాఖలు తమకు నిర్దేశించిన ప్లాంటేషన్ లక్ష్యాలను సాధించాలన్నారు. ముఖ్యంగా ఎవెన్యూ ప్లాంటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మేజర్ ట్రెచ్ లకు ప్రత్యేక అధికారులను నియమించాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనలో హరితహారం కార్యక్రమం ప్రగతిని కూడా సమీక్షించాలని కలెక్టర్ సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులు 33 వినతులు స్వీకరించినట్లు ఆయన తెలిపారు. వాటిని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

పిల్లలకు తల్లిపాలు అమృతంతో సమానం..

పిల్లలు ఆరోగ్యంగా జీవించడానికి తల్లిపాలు అమృతంతో సమానమని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తల్లిపాల వారోత్సవాల పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెంపొందడానికి తల్లి పాలు ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు బి.సత్య ప్రసాద్, ఎన్. ఖీమ్యానాయక్, వేములవాడ ఆర్డీవో పవన్ కుమార్, జడ్పీ సీఈవో గౌతం రెడ్డి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed