ముఖ్య మంత్రి, మంత్రి పై నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదు : ప్రణయ్ బాబు

by Aamani |
ముఖ్య మంత్రి, మంత్రి పై నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదు : ప్రణయ్ బాబు
X

దిశ,హుజురాబాద్ రూరల్ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ల పై నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఓడితల ప్రణయ్ బాబు హెచ్చరించారు. సోమవారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఫ్లయూష్ సరఫరా చేసే విషయంలో వేబిల్ ఉండదనే విషయం ఎమ్మెల్యేకు తెలియకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఒక ఎమ్మెల్యేగా ఉండి లారీలను రోడ్లపై నిలిపివేస్తూ ఎంవిఐ, ఆర్టీవో ఉద్యోగం చేస్తున్న ఆయనను చూసి నియోజకవర్గ ప్రజలు జాలి పడుతున్నారని ఎద్దేవ చేశారు. ప్లై యూష్ విషయంలో స్కామ్ ఎక్కడ జరిగిందో చెప్పకుండా అనవసర రాద్ధాంతం చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు. ఆయన సవాల్ కు నేనొక్కడినే సరిపోతానని ఆధారాలు ఉంటే చూపాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో బ్లాక్ మెయిలర్ స్టార్ గా పేరుపొందిన కౌశిక్ రెడ్డి ని చూసి ఎమ్మెల్యే పదవి సిగ్గుపడుతుందని చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తూ ఇసుక దందా చేసిన చరిత్ర కౌశిక్ రెడ్డికి ఉందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వడ్లూరు విజయ్ కుమార్, కాజీపేట శ్రీనివాస్ ,సొల్లు బాబు, పొనగంటి మల్లయ్య, మిడిదొడ్డి శ్రీనివాస్, కొలిపాక శంకర్,వేముల పుష్పలత, లావణ్య, చంద మల్ల బాబు, బిక్షపతి ,తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed