అది ఆవిర్భావ సభలా లేదు.. సంతాప సభలా ఉంది: బండి సంజయ్

by Dishanational1 |
అది ఆవిర్భావ సభలా లేదు.. సంతాప సభలా ఉంది: బండి సంజయ్
X

దిశ, మెట్ పల్లి: విధివిధానలు లేకుండా జాతీయ పార్టీని ఏర్పాటు చేయడం వెనుక ముఖ్యమంత్రి కుటుంబాన్ని కాపాడుకునే కుట్ర దాగి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. శుక్రవారం జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో ప్రజాసంగ్రామ యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా సంజయ్ మీడియాతో మాట్లాడూతూ... కేసీఆర్, బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అంటూ సంజయ్ ఘాటైన విమర్శలు చేశారు. జాతీయ పార్టీ అంటూ నాటకాలు ఆడుతున్నారు కానీ, నేషనల్ పార్టీకి సంబంధించిన విధివిధానలే ప్రకటిచంలేదన్నారు. పార్టీ ప్రారంభించినప్పుడు ఏం చేస్తాడో ప్రజలకు వివరించాల్సిన ఆవశ్యకత ఉన్నప్పటికీ ఆ దిశగా ఎలాంటి ప్రకటన చేయలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఈరోజు బీఆర్ఎస్ ప్రకటించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన ఒక్కరి మొఖంలో కూడా నవ్వు లేదని, అది ఆవిర్భావ సభలా లేదని సంతాప సభలా ఉందంటూ బండి సంజయ్ ఎద్దేవ చేశారు.

కేసీఆర్ బిడ్డ కవిత ప్రాంతీయ పార్టీగా ఉన్నప్పుడే ఢిల్లీలో లిక్కర్ దందా చేసిందని, ఇప్పుడు అంతర్జాతీయ లిక్కర్ దందా చేస్తదేమోనని వ్యాఖ్యానించారు. కవిత లిక్కర్ దందా పక్కదారి పట్టించేందుకే బీఆర్ఎస్ పార్టీ ప్రకటన అని దుయ్యబట్టారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని రూ. 5 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరకపోయేలా చేశాడని సంజయ్ ఆరోపించారు. ఇక్కడ ఏమీ పీకలేనోడు దేశ రాజకీయాల్లో ఏం పీకుతాడని, ఆయనవన్నీ బూటకపు వాగ్దానాలేనని విమర్శించారు. పంజాబ్ రైతులకు ఇచ్చిన చెక్కులు చెల్లని పరిస్థితి తయారైందంటే రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఏ స్థాయిలో చేరుకుందో అర్థం చేసుకోవచ్చని సంజయ్ అన్నారు. కాషాయ జెండా కాంతిలో రంగురంగుల జెండాలు మాడి మసైపోతాయని, గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ విక్టరీ దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్ ప్రకటన తెరపైకి తీసుకొచ్చాడని సంజయ్ మండిపడ్డారు. సమైక్యవాది అయిన ఉండవల్లిని పిలిచి దావత్ ఇచ్చిన ఘనడు సీఎం కేసీఆర్ అని, రెండు రాష్ట్రాల నాయకులు కుట్రలతో సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మధ్య పరస్పరం కమిషన్ ఇచ్చిపుచ్చుకునేందుకు అండర్ స్టాడింగ్ ఏర్పడిందని ఆరోపించారు. బెంగుళూరులో డిపాజిట్ రానివాళ్లను, దిక్కూ దివానా లేని తుక్డే గ్యాంగ్ ను పట్టుకొచ్చుకున్నాడని, కృష్ణా జలాల వినియోగం విషయంలో ముఖ్యమంత్రి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశాడన్నారు. తెలంగాణాకు 575 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా 299 టీఎంసీలకే సంతకం చేసి రాష్ట్ర ప్రజల నోట్లో మట్టికొట్టాడన్నారు.


Next Story

Most Viewed