మహిళా సాధికారత - ఎక్సలెన్సీ అవార్డుకు ఎంపికైన సత్తవ్వ

by Dishanational1 |
మహిళా సాధికారత - ఎక్సలెన్సీ అవార్డుకు ఎంపికైన సత్తవ్వ
X

దిశ, జగిత్యాల రూరల్: మండలంలోని లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన మహిళా సంఘం సభ్యురాలు మారు సత్తవ్వ రాష్ట్ర స్థాయి మహిళా సాధికారత - ఎక్సలెన్సీ అవార్డుకి ఎంపిక అయినట్టు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎస్. వినోద్ ఒక ప్రకటనలో తెలిపారు. సత్తవ్వ గత 15 సంవత్సరాలుగా మహిళా సంఘంలో, గ్రామ సంఘంలో, మండల సంఘంలో, జిల్లా సమాఖ్యలో వివిధ హోదాలలో పదవులు నిర్వహించి మహిళ సాధికారతకు పాటుపడ్డారని, మహిళా సంఘాల బలోపేతానికి కృషి చేయడంలో ముఖ్య భూమిక పోషించారని, అందుకు గాను రాష్ట్ర స్థాయిలో ఆయా రంగాల్లో విశేష కృషి చేసిన మహిళలకు ప్రముఖులచే ఇట్టి అవార్డులను ప్రదానం చేయిస్తున్నారని, మారు సత్తవ్వకు రాష్ట్ర మహిళా సాధికారత-ఎక్సలెన్సీ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం నుండి మూడు జిల్లాల నుండి వరంగల్, ఖమ్మం మరియు జగిత్యాల జిల్లాల నుండి ముగ్గురికి ఈ అవార్డులు ప్రదానం చేస్తున్నారని, మొత్తంగా రాష్ట్ర స్థాయిలో వివిధ రంగాల్లో కృషి చేసిన 9 మంది మహిళలకు ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారని అదనపు ప్రాజెక్టు సంచాలకులు సుదీర్ అన్నారు. ఈ అవార్డును శనివారం హైదరాబాద్ లో కొండాపూర్ లోని నోవాటేల్ లోని ప్రముఖులచే ప్రదానం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మండల ఏపీఎం వోదెల గంగాధర్, సిబ్బంది సత్తవ్వకు అభినందనలు తెలిపారు.


Next Story

Most Viewed