ఎన్నికల వేళ తెరపైకి ఆలయ భూముల వివాదం.. ఇరకాటంలో పెద్దపల్లి ఎమ్మెల్యే

by Dishafeatures2 |
ఎన్నికల వేళ తెరపైకి ఆలయ భూముల వివాదం.. ఇరకాటంలో పెద్దపల్లి ఎమ్మెల్యే
X

దిశ, కరీంనగర్​ బ్యూరో: ఎన్నికలకు ముందు ఆఎమ్మెల్యేకు ఆలయ భూముల వివాదం చెమటలు పుట్టిస్తోంది. ఇన్నాళ్లు భూముల విషయంలో రెవెన్యూ, దేవాదాయశాఖకు మాత్రమే పరిమితమైన పెద్దపల్లి జిల్లాలోని రంగనాయకులస్వామి దేవాలయ భూముల వివాదం హైకోర్టుకు చేరింది. దేవాలయ భూముల అక్రమణ విషయంలో పెద్దపల్లి ఎమ్మెల్యేతో పాటు పలువురికి హైకోర్టు నోటిసులు ఇవ్వడంతో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్​ రెడ్డి ఇరకాటంలో పడ్డారు. పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి మండలం ముత్తారం ధర్మాబాద్​ గ్రామంలో ఉన్న శ్రీరంగనాయకుల స్వామి దేవాలయానికి దూపదీప నైవేద్యాల కోసం 462.33ఎకరాల భూములను ఇనాంగా ఇచ్చారు. ఆలయ భూములు పెద్దపల్లి మండలంలోని కాసులపల్లి, పాలితం, గౌరెడ్డిపేట, ముత్తారం గ్రామాల్లో ఉన్నాయి.

శ్రీరంగనాయకుల స్వామి వారి భూముల వివాదం అనేక సంవత్సరాలుగా కొనసాగుతుంది. దేవాలయానికి సంబంధించిన భూములను అప్పగించాలని 2013లో అప్పటి దేవాదాయ శాఖ అధికారులు పెద్దపల్లి తహసీల్దార్​కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ నిర్వహించిన తహసీల్దార్​ నివేదికను 2013 సెప్టెంబర్​లో పెద్దపల్లి ఆర్టీఓకు పంపించారు. తహసీల్దార్​ నివేదిక ఆధారంగా అప్పటి పెద్దపల్లి ఆర్టీఓ నాలుగు గ్రామాల్లో ఉన్న 462.33ఎకరాల భూములు శ్రీరంగనాయకుల స్వామి వారికి చెందిన భూములుగా పేర్కొంటు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి నుంచి వివాదం రోజు రోజుకు చిలిచిలికి గాలివానగా మారింది.

గతంలో దేవుడి పేరునా భూములు

శ్రీరంగనాయకుల స్వామి దేవాలయానికి ఇనాంగా ఇచ్చిన భూములు గతంలో రెవెన్యూ రికార్డుల ప్రకారం దేవుడి పేరునా ఉండేవి. ప్రస్తుతం మోకామీ ఉన్న వారిలో కొందరు కొనుగోలు చేయగా మరి కొందరు వారి తాతలు, తంద్రుల వారసత్వంగా సక్రమించినట్లు చెబుతున్నరాఉ. భూముల క్రయ విక్రయాలు జరిగి రెవెన్యూ రికార్డుల్లో రైతుల పేర్లు మార్పు చేయడంతో గతంలో చాలా మందికి పట్టాదారు పాసు పుస్తకాలు, టైటిల్​ డీడ్​ సైతం ఇచ్చారు. స్వామివారి భూముల విషయంలో పెద్దపల్లి ఆర్డీఓ ఇచ్చిన తీర్పులో గతంలో ఇచ్చిన పట్టదారు పాసు పుస్తకాలు రద్దు చేయాలని, రెవెన్యూ రికార్డుల్లో శ్రీరంగ నాయకుల స్వామి పేరు నమోదు చేయాలని పేర్కొన్నారు. ఆర్డీఓ తీర్పుతో మోకా మీద ఉన్న రైతులు గతంలో హైకోర్టును ఆశ్రయించారు.

ఎన్నికల వేళా మళ్లీ తెరపైకి

ఎన్నికల సమయంలో తెరపైకి పెద్దపల్లి జిల్లాలోని ముత్తారంలోని శ్రీరంగనాయకుల స్వామి దేవాయలం భూముల అక్రమణదారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రంగనాయకులస్వామి భూములపై పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్​ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులు సన్నిహితులు, ఇతరులు అక్రమించారని రాష్ర్టీయ హిందూ పరిషత్​ సంస్థకు చెందిన జాపతి రాజేష్​​ హైకోర్టును ఆశ్రయించారు. ఈనెల 3వ తేదినా విచారణకు వచ్చింది. ఆలయభూములు తిరిగి అప్పగించాలని, అక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని వాదనలు వినిపించగా అక్రమదారులకు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అయితే దేవాలయ భూములు ఎక్కువ మొత్తంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్​ రెడ్డి కుటుంబ సభ్యులకు ఎక్కువ మొత్తంలో భూములు ఆధీనంలో ఉండటంతో ఎన్నికల సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేకుసంకటంగా మారింది.

Next Story