ధర్మపురి జనసేనాని పర్యటనలో.. అధికారులపై భక్తుల ఆగ్రహం

by Disha Web |
ధర్మపురి జనసేనాని పర్యటనలో.. అధికారులపై భక్తుల ఆగ్రహం
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: ధర్మపురి జనసేనాని పర్యటనలో అధికారులపై భక్తుల ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో వారాహి వాహన పూజ ముగిసిన తర్వాత మధ్యాహ్నం ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి బయలుదేరి వెళ్లారు. ఆలయానికి పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో అధికారులు కొంతసేపు సాధారణ భక్తులను క్యూ లైన్‌లోనే ఆపివేశారు. గంట సేపటికి పైగా దర్శనానికి అనుమతించకపోవడంతో అధికారుల తీరుపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నపిల్లలు వృద్ధులతో క్యూలైన్‌లో వేచి చూస్తున్నామని, తాగడానికి కనీసం మంచినీళ్లు ఇచ్చే వాళ్లు కూడా లేరని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.Next Story