స్పందన స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయం: నాబార్డ్ ఏజీఎం అనంత్ పటాలా

by Disha Web Desk 12 |
స్పందన స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయం: నాబార్డ్ ఏజీఎం అనంత్ పటాలా
X

దిశ, శంకరపట్నం: స్పందన సొసైటీ స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయమని, నాబార్డ్ ఏజీఎం అనంత్ పటాలా సంస్థ సేవలను కొనియాడారు. గురువారం నాబార్డ్ సౌజన్యంతో స్పందన ఫెవో సొసైటీ ఆధ్వర్యంలో శంకరపట్నం మండలం కేశవపట్నంలో మహిళలకు ఫ్యాషన్ డిజైన్ పై ఉచిత శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏజీఎం అనంత్ పటాలా మాట్లాడారు. మహిళలు స్వశక్తిపై ఆర్థికంగా ఎదిగేందుకు స్పందన సేవా సొసైటీ సంస్థ ఎంతో అండగా ఉంటుందని, మహిళలు స్వచ్ఛంద సంస్థ సేవలను సద్వినియోగం చేసుకొని ఉచిత ఫ్యాషన్ డిజైనింగ్ శిక్షణ పొంది, ఆర్థికంగా మరింత ఎదిగి, ముందుకు సాగాలని సూచించారు.

సేవా సంస్థ ద్వారా 15 రోజుల పాటు ఉచితంగా మహిళలకు ఫ్యాషన్ డిజైనింగ్ పై శిక్షణనిచ్చి శిక్షణ పత్రాలను కూడా సంస్థ ఆధ్వర్యంలో అందజేయడం జరుగుతుందని వెల్లడించారు. మహిళా సంఘంలోని సభ్యులు ఈ ఉచిత డిజైనింగ్ శిక్షణ శిబిరంలో శిక్షణ పొంది మరింత ముందుకు సాగాలని చెప్పారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండారి స్వప్న తిరుపతి, ఎంపీటీసీ 1 బొజ్జ కవిత కోటిలింగం, ఐకెపి ఎపిఎం సుధాకర్, సి సి సంపత్, స్పందన సేవా సంస్థ ట్రైనర్లు వాణి, సులోచన మహిళా సంఘం ప్రతినిధులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Next Story

Most Viewed