చెరువు మాయం.. అధికారులు మౌనం

by Dishafeatures2 |
చెరువు మాయం.. అధికారులు మౌనం
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: ఎల్లారెడ్డిపేట మండలంలోని అగ్రహారం గ్రామంలో అగ్రహారం కుంట చెరువుకు సంబంధించి సుమారు 10 ఎకరాల 26 గుంటల భూమి కబ్జాకు గురవుతూ వస్తోందని గ్రామస్థులు చెబుతున్నారు. ఒకప్పుడు ఈ చెరువు నీళ్లతోనే రైతుతు పంటలు పండించుకునేవారని, ముదిరాజులు అందులో చేపలు పట్టుకొని జీవనం సాగించేవారని అన్నారు. అయితే ఈ భూములను కొందరు వ్యక్తులు కబ్జా చేయడంతో కులవృత్తి కోల్పోయామని ముదిరాజులు వాపోయారు. తమ భూమి తొమ్మిది సంవత్సరాల నుండి కబ్జాకు గురవుతూ వస్తోందని వాపోయారు. దాంట్లో పంట పొలాలు వేసుకుంటూ చెరువు లేకుండా చేశారు అని అగ్రహారం ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అధికారులకు పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కబ్జాకు గురైన 10 ఎకరాల 26 గుంటల భూమిని తిరిగి తమకు అప్పగించాలని అగ్రహారం ప్రజలు కోరుతున్నారు.

Next Story

Most Viewed