మల్యాల మండల ఎంపీపీగా ఆగంతం రవళి

by Aamani |
మల్యాల మండల ఎంపీపీగా ఆగంతం రవళి
X

దిశ, మల్యాల : మల్యాల ఎంపీపీ గా అగంతం రవళి వంశీధర్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. గత కొన్ని నెలల క్రితం బీఆర్ఎస్ ఎంపీపీ విమల పై ఎంపీటీసీ సభ్యులు అవిశ్వాసానికి తెరలేపగా ఎంపీటీసీలను ప్రలోభాలకు లోను చేసి తనపై అవిశ్వాసాన్ని పెట్టారని మిట్టపల్లి విమల కోర్టు నుండి స్టే తీసుకొని రావడం జరిగింది. కోర్టు ఇచ్చిన స్టే గడువు పూర్తి కావడంతో ఆర్డీవో సమక్షంలో ఎంపీపీపై అవిశ్వాసం నెగ్గడంతో వైస్ ఎంపీపీ పోతాని రవి కి ఎంపీపీ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు.

ఈరోజు ఆర్డీవో నిర్వహించిన ఎంపీపీ ఎన్నికలో ఎంపీపీ గా నామినేషన్ అగంతం రవళి ఒక్కరే వేయడం,హాజరైన 8 మంది ఎంపీటీసీ సభ్యులు అగంతం రవళికే మద్దతు ఇవ్వడంతో ఎంపీపీ ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు ఆర్డిఓ ప్రకటించడం జరిగింది.దీంతో మల్యాల ఎంపీపీగా అగంతం రవళీ బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించిన ఆగంతం రవళి కి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మల్యాల ప్రజా పరిషత్ కార్యాలయంలో కలిసి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

Next Story