- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తమ గుడిసె కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలి : బాధిత కుటుంబం
తమ గుడిసె కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది.

దిశ, గన్నేరువరం : గన్నేరువరం గ్రామంలో తల్లి వద్ద నుంచి వారసత్వంగా వచ్చిన భూమిలో అన్ని అనుమతులు పొంది ఇంటి నిర్మాణం చేపడుతుండగా తాత్కాలికంగా వేసిన గుడిసెను రాత్రి వేళల్లో దాడి చేసి కూల్చివేసి దాచుకున్న డబ్బులను ఎత్తుకొని వెళ్లిన అంబేద్కర్ సంఘ నాయకుడు కల్లేపల్లి శంకర్, వారి సోదరుడు కల్లెపల్లి బాలయ్య, వారి అల్లుడు శీను, కొడుకు మదీప్ తో పాటు కుటుంబ సభ్యుల పై చర్యలు తీసుకోవాలని బాధితురాలు బడుగు పుష్పలత, ఆమె భర్త లింగయ్య మీడియాతో గోడు వెల్లబోసుకున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. రామడుగు మండలం మోతే గ్రామానికి చెందిన బడుగు పుష్పలత తన తల్లి గుగ్గిళ్ళ కొమరవ్వ నుంచి వారసత్వంగా ఇంటి నెంబర్ 6-67/49 గల 210 చదరపు గజాల విస్తీర్ణం భూమిని డాక్యుమెంట్ నెంబర్ 5307/2023 తో రిజిస్ట్రేషన్ కలిగి ఉండి గ్రామపంచాయతీ అనుమతితో ఇంటి నిర్మాణం చేపట్టడానికి గుడిసె నిర్మించుకుని పనులు చేస్తుండగా అంబేద్కర్ సంఘం నాయకుడు కల్లేపల్లి శంకర్ కుటుంబ సభ్యులు ఆదివారం తమ ఇంటి నిర్మాణం జరుగుతున్న స్థలానికి వచ్చి తక్షణమే స్థలాన్ని వదిలి వెళ్లిపోవాలని లేకుంటే చంపేస్తామని దౌర్జన్యం చేసి బెదిరింపులకు గురి చేశారని తెలిపారు.
చుట్టుపక్కల వారు రావడంతో నానా బూతులు తిడుతూ వెళ్లిపోయారని తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో వీరంతా తమ గుడిసె పై దాడి చేసి నిర్మాణాన్ని కూలగొట్టి ఇంటిలో దాచుకున్న రూ.45000 ఎత్తుకొని పోవడంతో పాటు వంట సామాగ్రి వస్తువులను ధ్వంసం చేసి భయభ్రాంతులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రక్షణ కల్పించాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. ఉన్నతాధికారులు తక్షణం స్పందించి నిరుపేదలైన మమ్ములను వారి భారీ నుంచి కాపాడి రక్షణ కల్పించాలని, ఇంటి నిర్మాణాన్ని ధ్వంసం చేసిన కల్లేపల్లి శంకర్ కుటుంబ సభ్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై కల్లేపల్లి శంకర్ ని వివరణ కోరగా ఆ స్థలం తనదేనని తాను కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అడ్డదారిలో వారసత్వ కాగితాలు సృష్టించి స్థలం మాదే అని గుడిసె వేసి ఆక్రమణకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై అనేకసార్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసినప్పటికీ సమస్య తీరడం లేదన్నారు. తాను ఏ భూమిని ఆక్రమించలేదు అని తెలిపారు.






