గొడ్డలితో బస్సు ముందు యువకుడి వీరంగం

by Dishafeatures2 |
గొడ్డలితో బస్సు ముందు యువకుడి వీరంగం
X

దిశ, పెగడపల్లి: పెగడపల్లి నుండి జగిత్యాల వెళ్తున్న ఆర్టీసి బస్సును వెంబడించిన ఓ యువకుడు బతికేపల్లి గ్రామానికి రాగానే బస్సును ఆపి వీరంగం సృష్టించాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. బతికేపల్లి గ్రామానికి అనుబంధంగా ఉన్న కొండయ్యపల్లికి చెందిన ఆటో డ్రైవర్ మధు.. బస్సు డ్రైవర్ సైడ్ ఇచ్చిన ఆటోను ముందుకు పోనీయకుండా బస్సులోని యువతులకు సైట్ కొడుతూ నిర్లక్ష్యంగా ఆటో నడపసాగాడు. దీంతో బస్సు డ్రైవర్ వేగాన్ని పెంచి బస్సును ముందుకు పోనిచ్చాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మధు బస్సును వెంబడిస్తూ ఆటోను బస్సు ముందు ఉంచి నానా హంగామా సృష్టించాడు. అనంతరం ఓ గొడ్డలి తీసుకొని చంపుతానంటూ డ్రైవర్ ను బెదిరించాడు. బస్సు డ్రైవర్ ను తీవ్ర పదజాలంతో దూషిస్తూ గొడ్డలితో దాడి చేసేందుకు యత్నించాడు. వెంటనే అలెర్ట అయిన కండక్టర్ పోలీసులకు ఫోన్ చేయగా వారు వచ్చేలోగా సదరు యువకుడు అక్కడి పారిపోయాడు. అయితే యువకుడి వింత ప్రవర్తనతో బస్సులో ప్రయాణిస్తున్న మోడల్ స్కూల్ కు చెందిన విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధింన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story