భారీ ట్రక్కుతో తప్పిన ప్రమాదం

by Disha Web |
భారీ ట్రక్కుతో తప్పిన ప్రమాదం
X

దిశ, రామడుగు: గంగాధర మండల పరిధిలోని ఎక్స్ రోడ్డు వద్ద క్వారీ ట్రక్కు జాయింట్ ఊడిపోవడంతో వెనుకాల ఉన్న ట్రాలీ కాస్త అక్కడికక్కడే కూలి కింద పడింది. ట్రాలీలో ఉన్న పెద్ద బండరాయి కాస్త రోడ్డుపైన పడకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. రైల్వే ట్రాక్ వద్ద ఉన్న క్వారీ లో బండరాలను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న సమయంలో ట్రక్కు ట్రాలీపై భారీ బండను వేసుకొని కరీంనగర్ వైపు వెళుతుంది. ఈ క్రమంలో ట్రక్కుకు ఉన్న జాయింట్ ఒక్కసారిగా ఊడిపోవడంతో ట్రాలీ అక్కడికక్కడే ఊడి కింద పడింది. దీంతో దాదాపు మూడు గంటలకు పైగా బండ రాయి ఉన్న ట్రాలీ నడి రోడ్డులో ఉండటంతో స్వల్పంగా ట్రాఫిక్ స్థంభించింది.Next Story