మంత్రి గంగులకు చేదు అనుభవం.. నిలదీసిన మహిళలు

by Disha Web Desk 23 |
మంత్రి గంగులకు చేదు అనుభవం.. నిలదీసిన మహిళలు
X

దిశ,కరీంనగర్: మంత్రి, కరీంనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారం కోసం కరీంనగర్ రూరల్ మండలం ఎలబోతారం గ్రామానికి వెళ్లిన గంగులను అక్కడి మహిళలు నిలదీశారు. అభివృద్ధి చేశాను.. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ప్రకటించుకున్నావు.. అభివృద్ధి ఎక్కడుంది..? సంక్షేమం ఎక్కడ చేశావ్..? అంటూ నిలదీశారు. ప్రచార వాహనం నుంచి కిందకు దిగాలని పలువురు మహిళలు డిమాండ్ చేయగా, గంగుల కమలాకర్ వాహనం దిగి మహిళల వద్దకు వచ్చారు.

ఈ సందర్భంగా తమ గ్రామాల్లో రోడ్లు తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు ఎవరికి అందలేదని, ఉద్యోగాలు లేక, ఉపాధి కరవై పిల్లలకు పెళ్లిళ్లు కూడా కావడం లేదని, తావి మంత కష్టాల్లో ఉంటే అందరినీ ఉద్దరించామని ప్రకటించుకుంటూ ప్రచారం చేయడమేమిటని ప్రశ్నించారు. దీంతో గంగుల వారిని వారించే ప్రయత్నం చేసి, ప్రచారాన్ని ముగించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Next Story