డిసెంబర్‌లోపే కేసీఆర్ ప్రగతి భవన్ ఖాళీ: కేఏ పాల్

by Disha Web Desk 2 |
డిసెంబర్‌లోపే కేసీఆర్ ప్రగతి భవన్ ఖాళీ: కేఏ పాల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్ వచ్చే డిసెంబర్ చివరి నాటికి ప్రగతి భవన్ ఖాళీ చేయడం పక్కా అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేసీఆర్ విఫలం అయ్యారని చిన్నారులను కుక్క కాట్ల నుంచి కాపాడలేని సీఎం హైదరాబాద్‌ను విశ్వనగరంగా చేస్తానని గొప్పలు చెబుతున్నాడని ధ్వజమెత్తారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన పాల్.. కేసీఆర్ తనను అరెస్ట్ చేయాలని చూస్తున్నాడని కానీ అతడి వల్ల సాధ్యం కాదన్నారు.

కేసీఆర్ ప్రభుత్వంపై తాను సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తున్నట్లు చెప్పారు. కొంతమంది నా అడ్వకేట్‌లు అమ్ముడు పోవడం వల్లే నేను అడ్వకేట్ కావాల్సి వచ్చిందని చెప్పారు. సుప్రీంకోర్టులో మూడు కేసులు ఫైల్ చేయబోతున్నామని ఈ కేసులను తామే గెలవబోతున్నామన్నారు. సీఎం కాకమునుపు కేసీఆర్ పేదరికంలో ఉండేవాడని తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉండేదన్నారు. సీఎం పీఠం ఎక్కిన తర్వాత ఈ పరిస్థితి తారుమారైందని కేసీఆర్‌కు ఆస్తులు వచ్చి చేరితే తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని ఆరోపించారు.



Next Story

Most Viewed