మంత్రి తలసానికి కేఏ పాల్ బంపర్ ఆఫర్

by Disha Web Desk 12 |
మంత్రి తలసానికి కేఏ పాల్ బంపర్ ఆఫర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బానిస బతుకు వద్దని, ప్రజాశాంతి పార్టీలో జాయిన్ అవ్వాలని ఆ పార్టీ చీఫ్ కేఏపాల్ ఆఫర్ ఇచ్చారు. కాంగ్రెస్ బీ టీమ్ బీఆర్ఎస్ పార్టీ అని, అవి తెలంగాణ రాష్ట్రంలో గెల్వవని చెప్పారు. ఇవాళ బీఆర్ఎస్ మంత్రులపై ఈసీకి కేఏపాల్ ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతలు దానం నాగేందర్, తాత మధు ఎలక్షన్ కమిషన్ కు వార్నింగ్ ఇస్తున్నారని ఆరోపించారు. దానం నాగేందర్ గులాబీ జెండా మోసే వాళ్లకు తప్ప వేరే వాళ్లకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వమని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. గతంలో జరిగిన మునుగోడు, హుజురాబాద్ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాలేదన్నారు. రాష్ట్రంలో బీజేపీ అసలే లేదు.. ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి రానుందని తెలిపారు. ఆశావాహులు అందరూ రూ. 10 వేలు కట్టి పార్టీ బీ ఫామ్ పొందండని పిలుపునిచ్చారు. పోలీసులకు కూడా అండగా ప్రజాశాంతి పార్టీ ఉందని పేర్కొన్నారు.

Next Story