జాబ్స్ Vs KTR.. మంత్రి లెక్కలపై నిరుద్యోగులు ఫైర్!

by Disha Web Desk 4 |
జాబ్స్ Vs KTR.. మంత్రి లెక్కలపై నిరుద్యోగులు ఫైర్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కేసీఆర్ సర్కార్ మోసం చేసిందని నిరుద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో కూడా నిరుద్యోగమే ప్రధాన అంశంగా ప్రతి పక్షాలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. దీనిపై మంత్రి కేటీఆర్ తాజాగా స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. తాము లక్ష ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి హామీ ఇచ్చామని, తొమ్మిదిన్నర ఏళ్లల్లో 2,32,308 ప్రభుత్వ ఉద్యోగాలను గుర్తించి, ఇందులో ఇప్పటికే 1,60,083 లక్షలకు పైగా భర్తీ చేశామన్నారు.

దేశంలోనే అత్యధిక ఉద్యోగాల భర్తీ తెలంగాణలోనేని, అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని తాజాగా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. దీనిపై నిరుద్యోగులు, ప్రతిపక్షాలు స్పందించాయి. ఈ ఉద్యోగాల్లో కేసులు కాకుండా కనీసం ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయాలని నిరుద్యోగులు, ప్రతిపక్షాలు మంత్రిపై మండిపడ్డాయి. రాష్ట్రంలో 12 ఏళ్ళ తర్వాత గ్రూప్ 1 నిర్వహిస్తే ప్రిలిమ్స్ పేపర్ లీక్, టీఎస్పీఎస్సీ ఎన్నో ఎగ్జామ్స్‌లు పోస్ట్ పోన్, క్యాన్సిల్ అయ్యాయని, పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కోర్టు కేసులో ఉందని, అరకొరగా వేసిన డీఎస్సీ లాంటి ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వడం వరకే పరిమితం అయ్యాయని నిరుద్యోగులు, ప్రతి పక్షాలు గుర్తుచేశారు.



Next Story

Most Viewed