మెగా జాబ్ మేళా ప్రారంభించిన మంత్రులు

by Ajay Maddhiboyina |

‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’లో భాగంగా, మైనార్టీ సంక్షేమ శాఖ, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని నాంపల్లి రెడ్ రోజ్ గార్డెన్‌లో మెగా జాబ్ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మంత్రులు అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.

మెగా జాబ్ మేళా ప్రారంభించిన మంత్రులు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’లో భాగంగా, మైనార్టీ సంక్షేమ శాఖ, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని నాంపల్లి రెడ్ రోజ్ గార్డెన్‌లో మెగా జాబ్ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మంత్రులు అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇంతటి భారీ స్థాయిలో జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. మైనార్టీ యువత ఆర్థికాభివృద్ధికి, వారి భవిష్యత్తుకు బాటలు వేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని స్పష్టం చేశారు. "ఈ జాబ్ మేళా ద్వారా మైనార్టీ సోదర సోదరీమణులకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభించి, వారు ఆర్థికంగా స్థిరపడాలి.

భవిష్యత్తులో ఈ తరహా ఉద్యోగ మేళాలను కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా, రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తాం" అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. ఎంపిక కాని అభ్యర్థులు నిరుత్సాహపడకుండా, ఆత్మవిశ్వాసంతో తదుపరి అవకాశాల కోసం సిద్ధం కావాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన మైనార్టీ సంక్షేమ శాఖ, ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులను మంత్రులు అభినందించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, మైనార్టీ గురుకుల వైస్ చైర్మన్ ఫహీముద్దీన్ ఖురేషీ, మైనార్టీ వెల్ఫేర్ సెక్రటరీ బి.షఫీఉల్లా, ఉర్దూ అకాడమి చైర్మన్ తాహిర్ బిన్ హందాన్ తదితరులు పాల్గొన్నారు.

Next Story