ఏడో తేదీన ఏఎంఎస్‌లో జాబ్ మేళ

by Dishanational2 |
ఏడో తేదీన ఏఎంఎస్‌లో జాబ్ మేళ
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్​ఆంధ్ర మహిళా సభ ప్రాంగణంలో కాలేజ్ ఆఫ్​ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో రేపు(ఏడో తేదీన) జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు ఏఎంఎస్ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు మేళ ప్రారంభమవుతుంది. ఇందులో పలు ఇంటర్నేషనల్, స్టేట్ బోర్డు స్కూల్స్ పాల్గొంటున్నాయన్నారు. మేళకు బీఈడీ, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్, పీజీ డిప్లామో ఈసీఈ, ఎంఈడీ కోర్సులు పూర్తి చేసిన నిరుద్యోగ యువత అర్హులు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు జాబ్ మేళను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


Next Story