రంగారెడ్డిలో బీఆర్ఎస్‌కు ఝలక్ తప్పదా?

by Disha Web Desk 4 |
రంగారెడ్డిలో బీఆర్ఎస్‌కు ఝలక్ తప్పదా?
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ నేతలు పక్క చూపులు చూస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. పార్టీ టికెట్ ఆశించి బీఆర్ఎస్‌లో చేరితే ప్రాధాన్యత లేదని కొందరూ.. రెండవ సారీ టికెట్ దక్కినా నిలబెట్టుకొని నేతలు తిరిగి టికెట్ దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ధపా టికెట్ దక్కకుంటే పార్టీ మారడం తథ్యమంటూ రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతుంది. అందులో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ బీసీ నేత అంతర్గతంగా టికెట్ నాకేనంటూ గ్రామాల్లో తిరుగుతూ చేబుతున్నారు.

అంతేకాకుండా ప్రస్తుతం రంగారెడ్డి శివారు నియోజకవర్గ ఎమ్మెల్యేతో సన్నిహితంగా ఉంటున్నప్పటికి చాప కింద నీరులాగా ఆ నేత వ్యవహారిస్తున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ అధినేత ఆశీస్సులు తమకే ఉన్నాయంటూ, టికెట్ దక్కకుంటే బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే పద్దతిని వికారాబాద్ జిల్లాకు చెందిన మరో బీఆర్ఎస్ నేత టికెట్ దక్కుతుందా లేదా అనే ఊగిసాలాటలో ఉన్నారు. అయితే బీఆర్ఎస్ అధినేత సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తామని ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో టికెట్ ఆశించే నియోజకవర్గ నేతలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలోని నేతలతో ఇప్పటికే మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది.

కర్ణాటక బార్డర్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నేత టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వ్యక్తికి అధిష్టానం వద్ద ప్రాధన్యత ఉండటంతో టికెట్ ఆశించే నాయకుడు పార్టీ మారేందుకు వ్యూహారచన చేస్తున్నారు. తనతో పాటు వికారాబాద్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల నేతలతో పాటు రంగారెడ్డి జిల్లాలోని ఓ నియోజకవర్గం ఎమ్మెల్యే, మరో నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యేలను కూడా తీసుకపోవాలని ఇప్పటికే స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆ నేతలు బహిరంగంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలపై, అధికారులపై మాట్లాడటం విశేషం.


Next Story

Most Viewed