తెలంగాణ రాష్ట్ర ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన జంఘ రాఘవ రెడ్డి

by Anjali |
తెలంగాణ రాష్ట్ర ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన జంఘ రాఘవ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని పరిశ్రమ భవన్‌లో నేడు జంఘ రాఘవ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రావాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్.. జంఘ రాఘవ రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ సీడ్స్ ను రైతుల్లో మరింత ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని పొన్నం సూచించారు. వంట నూనె దిగుమతులు తగ్గించే పామాయిల్ ప్రోత్సహించి వంట నూనెలు ఇక్కడే అధికంగా ఉత్పత్తి అయ్యేలా ప్రోత్సహించాలని జంఘ రాఘవ రెడ్డికి వివరించారు. ఆయిల్ ఫార్మ్ వ్యవసాయ సంబంధిత పంటలు వాటిని వ్యవసాయ శాఖతో సమన్వయం చేసుకుంటూ స్వయం సమృద్ధి సాధించేలా ఆయిల్ సీడ్స్ కార్పోరేషన్ పనిచేయాలని మంత్రి పొన్నం.. జంఘ రాఘవరెడ్డికి పలు సూచనలు చేశారు.

Next Story